పాడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
భాకరాపేట, సెప్టెంబర్ 5 (రాజనీతి): కరువు పరిస్థితుల్లో పశుగ్రాసం, నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పాడి రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని చిన్నగొట్టిగల్లు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింహాల మోహన్ డిమాండ్ చేశారు. శనివారం భాకరాపేటలో విలేకరులతో మాట్లాడుతూ వర్షాభావంతో పాల ఉత్పత్తి తగ్గి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు. సబ్సిడీపై దాణా, పశుగ్రాసం, సైలేజ్ అందించడంతో పాటు ఉచిత పశువైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. పశువులకు తాగునీరు, బీమా, రుణాల పునర్వ్యవస్థీకరణ, పాలపై కరువు బోనస్ వంటి సౌకర్యాలు కల్పించి రైతులను ఆదుకోవాలని కోరారు.