🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 04 Sep, 2026 | Page: 1

కోడూరు ఎమ్మెల్యేను కలిసిన వైసీపీ ఎస్సీ సెల్‌ నేతలు

పీలేరు, సెప్టెంబర్‌ 4 (రాజనీతి): కోడూరు ఎమ్మెల్యేను పీలేరులో శుక్రవారం వైఎస్సార్‌సీపీ దళిత సామాజికవర్గ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో వైసీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కల్లూరు చంగయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్న ఎల్లప్ప, రాష్ట్ర ఎస్సీ సెల్‌ కార్యదర్శి వడ్డీ హరి, సహాయ కార్యదర్శులు సదాశివకుమార్‌, రవీంద్ర, వెంకటస్వామి, జిల్లా ఉపాధ్యక్షుడు మలతోటి నరేష్‌, శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు చిన్ని కృష్ణయ్య, కందూరు ఈశ్వర్‌, విజయ్‌, చిన్న విజయ్‌, రమణ, రాజేశ్వరి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home