చికిత్స సులభం.. నిర్లక్ష్యమే ప్రాణాంతకం
తలుపుల, సెప్టెంబర్ 3 (రాజనీతి): సంక్రమణ వ్యాధుల నివారణకు ముందస్తు జాగ్రత్తలు, పరిసరాల పరిశుభ్రత ఎంతో అవసరమని పీహెచ్సీ ప్రధాన వైద్యాధికారి డా. శ్రీగిరీష తెలిపారు. విద్యానగర్లో ఉచిత వైద్య శిబిరం అనంతరం డా. శ్రీగిరీష్ మాట్లాడుతూ రికెట్సియా బ్యాక్టీరియా కలిగిన లార్వాలు కుట్టడం వల్ల స్క్రబ్ టైఫస్ వస్తుందని, సకాలంలో చికిత్స తీసుకుంటే నయం అవుతుందని, నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరంగా మారుతుందని తెలిపారు. తీవ్ర తలనొప్పి, జ్వరం, ఒంటినొప్పులు, దద్దుర్లు లక్షణాలన్నారు. వ్యాధి మనిషి నుంచి మనిషికి సోకదని, ఎలుకలు, పందికొక్కులు, వాటి ఆవాసాలను నిర్మూలించాలని సూచించారు.