🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 03 Sep, 2026 | Page: 1

ఆటో డ్రైవర్‌పై దాడి చేసి దోపిడీ.. ఇద్దరి అరెస్ట్‌

రేణిగుంట, సెప్టెంబర్‌ 3 (రాజనీతి): ఆటో డ్రైవర్‌ను అడ్డగించి బెదిరించి, దాడి చేసి సెల్‌ఫోన్‌, నగదు దోపిడీ చేసిన కేసులో ఇద్దరు నిందితులను గాజులమండ్యం పోలీసులు అరెస్ట్‌ చేశారు. పి.గుణశేఖర్‌ (20), గుండూరు లోకేష్‌ (21)లను సెప్టెంబర్‌ 2న యోగానంద కాలేజీ సర్కిల్‌ సమీపంలో అరెస్ట్‌ చేశారు. ఆగస్టు 31న రాత్రి సంతగేటు వద్ద సహచరులతో కలిసి ఆటో డ్రైవర్‌ను బెదిరించి అతని వద్ద ఉన్న వివో వై20 సెల్‌ఫోన్‌, రూ.2,200 నగదును దోచుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద రూ.500 నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉండగా, ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
🏠 Home