🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 02 Sep, 2026 | Page: 1

కేంద్ర పథకాల అమలులో పారదర్శకతకు ప్రాధాన్యత

మదనపల్లె, సెప్టెంబర్‌ 2 (రాజనీతి): కేంద్ర ప్రాయోజిత పథకాలను వేగంగా, పారదర్శకంగా, నాణ్యతతో అమలు చేసి అర్హులైన ప్రజలకు పూర్తిస్థాయి ప్రయోజనం అందించాలని రాజంపేట ఎంపీ, దిశా కమిటీ చైర్మన్‌ పి.వి.మిథున్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌తో కలిసి దిశా సమావేశం నిర్వహించారు. కరువు నేపథ్యంలో తాగునీరు, సాగునీరు, పశుదాణాకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఉపాధి హామీ పనిదినాలు పెంచాలని, గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని తెలిపారు. ప్రజా ఫిర్యాదులను త్వరగా పరిష్కరించి, ఎంపీ ల్యాడ్స్‌ పనులను నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు.
🏠 Home