🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 02 Sep, 2026 | Page: 1

పేదల మధ్య పవన్‌ జన్మదిన వేడుకలు...8వార్డు శ్యామ్ కుమార్

నిరాశ్రయులకు అన్నదానం.. 8 కిలోల కేక్‌తో సంబరాలు....

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని చిత్తూరు నగరంలోని 8వ వార్డు వెంగళరావు కాలనీలో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కాలనీకి చెందిన శ్యామ్‌కుమార్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో భాగంగా పట్టణంలోని షెల్టర్‌ ఫర్‌ అర్బన్‌ హోమ్‌లెస్‌ కేంద్రంలో నిరాశ్రయులకు అన్నదానం చేశారు. జన్మదిన వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా పేదలు నిరాశ్రయులకు అండగా నిలిచేలా సేవా కార్యక్రమాలు చేపట్టడం పలువురి ప్రశంసలు అందుకుంది.ఈ సందర్భంగా శ్యామ్‌కుమార్‌ మాట్లాడుతూ.. పవన్‌ కళ్యాణ్‌పై ఉన్న అభిమానాన్ని సేవా కార్యక్రమాల రూపంలో వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. గత పదేళ్లుగా ఆయన జన్మదినాన్ని ఇదే సేవా స్ఫూర్తితో జరుపుకుంటున్నామని ప్రతి ఏడాది పేదలు నిరాశ్రయులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. తనకు పదవి ముఖ్యం కాదని పవన్‌ కళ్యాణ్‌ చేస్తున్న అభివృద్ధి ప్రజలకు అందుతున్న సంక్షేమం రాష్ట్ర ప్రగతే ముఖ్యమని అన్నారు. ప్రజలకు మేలు జరిగేలా పనిచేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.అనంతరం కాలనీ వాసులు అభిమానులతో కలిసి 8 కిలోల భారీ కేక్‌ను కట్‌ చేసి పవన్‌ కళ్యాణ్‌ జన్మదిన వేడుకలు నిర్వహించారు. అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో హరి, రూపేష్‌, వినోద్‌సాగర్‌, జ్ఞాన ప్రకాష్‌, ప్రవీణ్‌కుమార్‌, జయకృష్ణ, పురుషోత్తం, తేజ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home