🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 01 Sep, 2026 | Page: 1

12వ వార్డులో గోపీనాథ్‌ జోరు..!పేదల గడప తొక్కిన కూటమి నేతలు.. పింఛన్‌తో భరోసా!

ఎంపీ ప్రసాదరావు, ఎమ్మెల్యే జగన్మోహన్‌తో కలిసి గోపీనాథ్‌ పింఛన్ల పంపిణీ....

చిత్తూరు: 12వ వార్డులో కూటమి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు డివిజన్‌ ఇన్‌చార్జి గోపీనాథ్‌ నాయకత్వం మరింత ఊపునిచ్చింది. పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్లను లబ్ధిదారుల గడప వద్దకే తీసుకెళ్లి అందించే కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌తో కలిసి 12వ వార్డు డివిజన్‌ ఇన్‌చార్జి గోపీనాథ్‌ ముందుండి ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.స్థానికంగా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, వారికి పింఛన్లు సకాలంలో అందేలా గోపీనాథ్‌ స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేశారు.ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు అందించారు. ఈ సందర్భంగా గోపీనాథ్‌ ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పేదల పక్షాన కూటమి ప్రభుత్వం.. ప్రజల గడప వద్దకే సంక్షేమం అనే నినాదంతో కార్యక్రమం కొనసాగింది. ఎంపీ ప్రసాదరావు, ఎమ్మెల్యే జగన్మోహన్‌ సైతం లబ్ధిదారులతో ఆప్యాయంగా మాట్లాడి ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదలకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు.12వ వార్డులో గోపీనాథ్‌ చొరవతో పింఛన్ల పంపిణీ కార్యక్రమం లబ్ధిదారుల చెంతకే చేరడంతో స్థానికంగా హర్షం వ్యక్తమైంది. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటూ.. ప్రభుత్వ సంక్షేమాన్ని గడపగడపకూ చేర్చడంలో గోపీనాథ్‌ కీలకంగా వ్యవహరించారని స్థానిక నాయకులు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
🏠 Home