🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 31 Aug, 2026 | Page: 1

ఎస్కేఆర్‌ ఆసుపత్రి ఘటనపై సమగ్ర విచారణ చేయాలి

మదనపల్లి, ఆగస్టు 31 (రాజనీతి): పీలేరులోని ఎస్కేఆర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటనపై సమగ్ర, నిష్పక్షపాత విచారణ జరిపించాలని కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ, ఆమ్‌ ఆద్మీ పార్టీ, ఎన్‌ఎస్‌ఎఫ్‌, ఏపీవీహెచ్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఆపరేషన్‌ చేసిన వైద్యుడి అర్హతలు, చికిత్స విధానం, అనస్థీషియా వివరాలు, వైద్య రికార్డులు, సీసీటీవీ దృశ్యాలు, అంబులెన్స్‌ సేవలను పరిశీలించాలని కోరుతూ అన్నమయ్య జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. దీనిపై కలెక్టర్‌ స్పందించి డీఎంహెచ్‌ఓను విచారణకు ఆదేశించారు. విచారణలో నిర్లక్ష్యం తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం అందించాలని నేతలు కోరారు.
🏠 Home