🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 31 Aug, 2026 | Page: 1

రిజర్వాయర్‌ బాధిత రైతులకు న్యాయం చేయాలి: రంగారెడ్డి

పుంగనూరు, ఆగస్టు 31 (రాజనీతి): నేతగుట్లపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించి న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి వంగిమళ్ల రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివారం రైతులతో కలిసి ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఎకరాకు రూ.14–15 లక్షల పరిహారం ఇస్తామని హామీ ఇచ్చినా నాలుగేళ్లుగా అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతుల పక్షాన పెద్దఎత్తున ఆందోళన చేపడతామని రంగారెడ్డి హెచ్చరించారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.
🏠 Home