హైకోర్టు న్యాయమూర్తికి రేణిగుంటలో ఘన స్వాగతం
రేణిగుంట, ఆగస్టు 28 (రాజనీతి): ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప కుటుంబ సమేతంగా శుక్రవారం రేణిగుంట రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం విజయవాడ నుంచి వందేభారత్ రైలులో వచ్చిన న్యాయమూర్తికి రైల్వే అధికారులు, పోలీసు అధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక వాహనంలో కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డు మార్గాన తిరుమలకు బయలుదేరి వెళ్లారు.