🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 27 Aug, 2026 | Page: 1

నేత్రధాన పక్షోత్చవాలను విజయవంతం చేద్దాం. డి. ఎమ్. హెచ్. ఓ.డాక్టర్ వై.శ్రీనివాసులు

మదనపల్లి 27/8/26
నేత్రధాన పక్షోత్చవాలను విజయవంతం చేద్దాం అని అన్నమయ్య జిల్లా డి. ఎమ్. హెచ్. ఓ.డాక్టర్ వై.శ్రీనివాసులు అన్నారు. జాతీయ నేత్రధాన పక్షోత్చావాలలో (ఆగష్టు 25నుండి సెప్టెంబర్ 8వరకు )భాగంగా డి. ఎమ్. హెచ్. ఓ వారి కార్యాలయం లోని డి. ఎమ్. హెచ్. ఓ. ఛాంబర్ లో నేత్రధాన పక్షోత్చవాల బ్యానర్స్, కరపత్రాలు, ప్లేడ్జి కార్డ్స్ లను డి. ఎమ్. హెచ్. ఓ. డాక్టర్ వై.శ్రీనివాసులు ఆవిష్కరణ చేశారు.ఈ సందర్బంగా డి. ఎమ్. హెచ్. ఓ. డాక్టర్ వై.శ్రీనివాసులు మాట్లాడుచు మనదేశం లో నేటికీ 68 లక్షల మంది కార్నియల్ అందత్వం తో బాధ పడుచున్నారని, ఇందులో అత్యధిక శాతం 30సంవత్సరముల లోపు వారు,ప్రతీ సంవత్సరము 40వేల నుండి 50వేల కొత్త కేసులు ఈ కార్నియల్ అందత్వo తో నమోదు అవుచున్నాయి. ప్రతీ సంవత్సరము 2లక్షల మంది కార్నియ మార్పిడి కొరకు ఎదురు చూస్తున్నారు.ప్రస్తుతం దేశం మొత్తం మీద కార్నియ సేకరణ కేవలం 60వేలు మాత్రమే. మనదేశ జనాభా 147కోట్లు, ప్రతీ సంవత్సరము కోటి మంది చనిపోవుచున్నారు. మర్ణించిన వారిలో 2శాతం మంది నేత్రాలు దానం చేస్తే కార్నియ అందత్వం నివారించవచ్చు.కార్నియ అంటే కంటి నల్ల గుడ్డు పైన పారదర్శకంగా ఉండే పొర. ఈ పొరకు ఏదైనా గాయం అయి లేదా అంటు వల్ల స్వచ్చత పోతే కంటి చూపు పాక్షికంగా లేదా పూర్తిగా పోయి అందత్వం వస్తుంది. దీనినే కార్నియల్ బ్లయిండ్నెస్ అంటారు. ఈ కార్నియల్ అందత్వానికి కారనాలు కార్నియాకు దెబ్బ లేదా గాయం కావడం, పోషకాహర లోపం, అంటువ్యాదులు సంభవించడం, రసాయనిక చర్యల వల్ల జరుగు ప్రమాదాలు, జన్యు పరమైన జబ్బులు, ఆపరేషన్ తరువాత వచ్చే ఇన్ఫెక్షన్లు కావచ్చు. పోగొట్టుకున్న కంటి చూపును చికిత్స ద్వారా లేదా నేత్ర దానం ద్వారా పొందవచ్చు. కార్నియల్ అందత్వం నివారించతగినది లేదా చికిత్స చేయతగినది. నేత్రధానానికి అర్హత ఏ వ్యక్తి అయినా స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ మతానికి చెందిన వారైనా నేత్రధానం చేస్తున్నట్టు ప్రకటించిన లేదా ప్రకటించక పోయిన కళ్ల ను దానం చేయవచ్చు. నేత్రధానం చేయుటకు సమీపంలో ఉన్న కంటి బ్యాంకు వారిని సంప్రదించాలి. ఏ వయసు వారైనా,కళ్ళజోడు పెట్టుకునే వారు, షుగర్ బి. పి, ఉబ్బసం వ్యాధులతో బాధపడే వారు కూడా నేత్ర దానం చేయవచ్చు. కంటి శుక్లల ఆపరేషన్ చేయించుకున్న వారు కూడా నేత్రధానం చేయవచ్చు. ఈ దానం చేయుటకు ఒకే ఒక షరతు ఏమంటే కార్నియ స్వచంగా, ఆరోగ్యాంగా ఉండాలి.మరణించిన ఆరు గంటల లోపు నేత్రలను తీయవలసి ఉంటుంది. అందుకే చనిపోయిన వెంటనే దగ్గర లోని ఐ బ్యాంకు వారికి సమాచారం ఇవ్వాలి. మరణించిన వ్యక్తి వద్ద ఫ్యాన్ లు ఆపి వేయాలి. ఏ. సి. లేదా కూలర్ లు ఆన్ చేసి ఉంచాలి. తడపిన దూది ని ఐస్ తో పాటుగా మూతబడిన కంటి పైన ఉంచాలి. తలకింద తలగడ పెట్టి తల ఎత్తు గా ఉండేలా చూడాలి. నేత్రధానం చేసిన వ్యక్తి నుండి రక్త పరీక్ష కు గాను 10ఎమ్. ఎల్ రక్తాన్ని తీస్తారు. శిక్షణ పొందిన వ్యక్తి స్టేరైలు పద్ధతి ద్వారా కళ్ళను బయటకు తీస్తారు. దీనివల్ల ముఖం పై ఎలాంటి మచ్చ పడదు. ముఖం వికృతంగా మారదు. నేత్రధానం వల్ల ఇద్దరు దృష్టి హీనులకు నేత్ర జ్యోతి లభిస్తుంది. ఎందుకంటే అందత్వం లో గల ఒక వ్యక్తి కి, దానం లభించిన ఒక కన్నుని మాత్రమే దానంగా ఇవ్వడం జరుగుతుంది. కంటి బ్యాంకు లో ఉన్న వెయిటింగ్ లిస్ట్ ప్రకారం అవసరం ఉన్న రోగికి కబురు పెట్టడం జరుగుతుంది. దానం చేయబడిన నేత్రాలను ఎన్నడూ అమ్మడం జరగదు.కార్నియ పొందిన వ్యక్తి పేరును రహస్యoగా ఉంచుతారు.
కావున నేత్రధాన ఉద్యమం లో పాల్గొని ప్రజలను చైతన్యం చేద్దాం.ఈ సంవత్సరము తీమ్ నేత్రధానం చేద్దాం ప్రతీ రోజు హీరోలుగా ఉందాం.నేత్రదానాన్ని కుటుంబ వారసత్వంగా పాటించి ఇద్దరి అంధులకు చూపుని ఇద్దాం.అనంతరం నేత్రధాన అవగాహనా ప్రతిజ్ఞను చేయించి కరపత్రాలు పంపిణీ చేశారు. కావున జిల్లా లోని స్వచ్ఛంద సేవా సంస్థలు, ఆరోగ్య సిబ్బంది ఈ నేత్రధాన పక్షోత్చావాలలో విరివిగా పాల్గొని ప్రజలను చైతన్యం చేసి అవగాహన కల్పించాలని కోరడమైనది.ఈ కార్యక్రమం లో డి. ఎమ్. హెచ్. ఓ. డాక్టర్ వై.శ్రీనివాసులు, డి. ఐ. ఓ. డాక్టర్ ఉషశ్రీ, కార్యాలయ పర్యవేక్షకులు దేవేంద్ర,డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ, పారామెడికల్ ఆప్తాలమిక్ ఆఫీసర్స్ రహమత్ అలీ ఖాన్, ఆజాద్, ,విజయ, శోభ ఎమ్. పి. హెచ్. ఈ. ఓ. సుధాకర్ రాజు,సబ్ యూనిట్ అధికారి ఖలీల్,గంగయ్య గౌడ సిబ్బంది పాల్గొన్నారు.
🏠 Home