ఎస్ఐఆర్పై అవగాహన కలిగి ఉండాలి: పెద్దిరెడ్డి
చౌడేపల్లి, ఆగస్టు 26 (రాజనీతి): ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి సూచించారు. పుంగనూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పార్టీ ఆధ్వర్యంలో అవగాహన సమావేశాలు నిర్వహించారు. మ్యాపింగ్ లేని, లాజికల్ డిస్క్రెపెన్సీలు ఉన్న ఓటర్లకు ఎన్నికల సంఘం నుంచి నోటీసులు అందిన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు, మండల నాయకులు, బూత్ కమిటీ కన్వీనర్లు, బీఎల్ఏలు, ప్రజాప్రతినిధులు, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.