🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 26 Aug, 2026 | Page: 1

ఎర్రావారిపాళెంలో హర్షిత్‌రెడ్డి పర్యటన

ఎర్రావారిపాళెం, ఆగస్టు 26 (రాజనీతి): వైఎస్సార్‌సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి బుధవారం ఎర్రావారిపాళెం మండలంలో పర్యటించారు. పుట్టవాండ్లపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన పార్టీ నేత సిద్ధరామిరెడ్డిని పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం పసుపులేటివారిపల్లిలో కార్యకర్త గుణశేఖర్‌ ఆచారి సోదరి శైలజ దశదిన కర్మకు హాజరై నివాళులర్పించారు. అనంతరం పార్టీ నాయకులతో సమావేశమై రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఐక్యతతో పనిచేసి విజయానికి కృషి చేయాలని సూచించారు. స్థానిక రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై చర్చించారు.
🏠 Home