🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 26 Aug, 2026 | Page: 1

సీఐటీయూ ఆటో యూనియన్‌ జిల్లా సహాయ కార్యదర్శిగా దీప

రేణిగుంట, ఆగస్టు 26 (రాజనీతి): తిరుపతి జిల్లా సీఐటీయూ ఆటో యూనియన్‌ నూతన కమిటీని బుధవారం పుత్తూరులో జరిగిన సమావేశంలో ఎన్నుకున్నారు. రేణిగుంట మండలానికి చెందిన పి.దీపను జిల్లా సహాయ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా దీప మాట్లాడుతూ మహిళా ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. సబ్సిడీ రుణాలతో ఆటోలు అందించి మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించాలని, రోడ్లపై ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
🏠 Home