రైతుల అభివృద్ధికి ఎఫ్పీఓలు దోహదం చేయాలి
పుంగనూరు, ఆగస్టు 25 (రాజనీతి): కల్లుపల్లి గ్రామంలో సుగుటూరు గంగమ్మ రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్పీఓ) 5వ వార్షిక మహాసభ నిర్వహించారు. 2025-26 ఆర్థిక సంవత్సర ప్రగతి, ఆర్థిక నివేదికలను సమీక్షించి, 2026-27 కార్యాచరణ, బడ్జెట్ను ఆమోదించారు. ఉద్యానవన శాఖాధికారి మాట్లాడుతూ తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని, ఫారం పాండ్ల ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలని సూచించారు. ఎఫ్పీఓల ద్వారా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని, ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్, విలువ జోడింపుతో రైతులు అధిక ఆదాయం పొందాలని కోరారు.