మూడు దశాబ్దాల నిస్వార్థ రాజకీయ ప్రస్థానం
చౌడేపల్లి, ఆగస్టు 25 (రాజనీతి): ‘జనం అంటే మనం’ అనే నినాదంతో మూడు దశాబ్దాలుగా ప్రజాసేవలో కొనసాగుతున్న నాయకుడు నరసింహులు యాదవ్ అని పలువురు కొనియాడారు. 1995లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన సర్పంచ్, వాటర్షెడ్ చైర్మన్, ఎంపీటీసీ సభ్యుడు, మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. 2000లో తీవ్ర కరువు సమయంలో తన మామిడి తోటను పశుపోషణ శిబిరానికి ఉచితంగా ఇచ్చి వేలాది పశువులకు మేత, నీరు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇటీవల పదవీకాలం ముగియడంతో స్థానిక నాయకులు, ప్రజలు ఆయనను ఘనంగా సన్మానించారు.