🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 25 Aug, 2026 | Page: 1

వేగ నిరోధకాన్ని గమనించక బైక్‌ అదుపుతప్పి ప్రమాదం

పుంగనూరు, ఆగస్టు 25 (రాజనీతి): పుంగనూరు మినీ బైపాస్‌ రోడ్డులోని కోర్టు సమీపంలో మంగళవారం ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. రామసముద్రం మండలం అరికెలకు చెందిన నారాయణ మనవడు హర్షతో కలిసి పుంగనూరు నుంచి తిరిగి వెళ్తుండగా కొత్తగా ఏర్పాటు చేసిన వేగ నిరోధకం కనిపించడంతో ఒక్కసారిగా బ్రేక్‌ వేశారు. దీంతో బైక్‌ అదుపుతప్పి కిందపడటంతో నారాయణకు తీవ్ర గాయాలు, హర్షకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వేగ నిరోధకాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరారు.
🏠 Home