🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 25 Aug, 2026 | Page: 1

మండల సమస్యలపై అలసత్వం వద్దు

చౌడేపల్లి, ఆగస్టు 25 (రాజనీతి): ప్రజాప్రతినిధులు లేకపోయినా మండల సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహించరాదని సభ్యులు సూచించారు. మంగళవారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ గాజుల రామమూర్తి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీటీసీల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఇదే చివరి సమావేశం కావడంతో సభ్యులను ఎంపీడీవో లీలామాధవి దుశ్శాలువాలతో సత్కరించి వీడ్కోలు పలికారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలని సభ్యులు అధికారులను కోరారు. సమావేశంలో జడ్పీటీసీ నడింపల్లి దామోదర్‌రాజు, ఉపాధ్యక్షులు నరసింహయాదవ్‌, సుధాకర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
🏠 Home