🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 24 Aug, 2026 | Page: 1

ఘనంగా టి.మునివెంకటప్ప ఐఏఎస్‌ వర్ధంతి వేడుకలు

చౌడేపల్లి, ఆగస్టు 24 (రాజనీతి): రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి టి.మునివెంకటప్ప వర్ధంతి వేడుకలను సోమవారం మర్రిమాకులపల్లి హైస్కూల్‌లో ఘనంగా నిర్వహించారు. హెడ్‌మాస్టర్‌ నాదమునినాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ వెంకట్‌రెడ్డి, మాజీ ప్రిన్సిపాల్‌ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, రిటైర్డ్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి గౌతమి, సామాజిక కార్యకర్త సహన, రిటైర్డ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ రెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు. అట్టడుగు వర్గం నుంచి ఐఏఎస్‌ స్థాయికి ఎదిగి, ఉన్నత పదవుల్లో నిజాయితీగా సేవలందించిన మునివెంకటప్ప ఆశయాలను విద్యార్థులకు వివరించారు. సమాజ సేవలో ఆయన జీవితం ఆదర్శమని కొనియాడారు.
🏠 Home