🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 23 Aug, 2026 | Page: 1

పీజీఆర్‌ఎస్‌ ఫిర్యాదుపై స్పందన.. ప్రభుత్వ భూమికి సూచిక బోర్డు

కలికిరి, ఆగస్టు 23 (రాజనీతి): ప్రభుత్వ భూముల ఆక్రమణలపై పీజీఆర్‌ఎస్‌లో చేసిన ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్‌ స్పందించడంతో అధికారులు చర్యలు చేపట్టారు. కలికిరి నాలుగు రోడ్ల కూడలి నుంచి కలకడ మార్గంలోని సర్వే నంబర్‌ 633లో ప్రభుత్వ భూమిని గుర్తించి ‘ప్రభుత్వ భూమి’ అని సూచిక బోర్డు ఏర్పాటు చేసినట్లు పీజీఆర్‌ఎస్‌ అర్జీదారుడు, రాష్ట్ర మాల మహానాడు అధికార ప్రతినిధి వి.హరి తెలిపారు. తహసీల్దార్‌ సయ్యద్‌ అహ్మద్‌ చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని బోర్డులో హెచ్చరించినట్లు తెలిపారు. గతంలో ఏర్పాటు చేసిన బోర్డును కొందరు తొలగించి ఆక్రమణలకు ప్రయత్నించారని హరి ఆరోపించారు.
🏠 Home