🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 23 Aug, 2026 | Page: 1

ఘనంగా ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు జయంతి

మదనపల్లె, ఆగస్టు 23 (రాజనీతి): ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని మదనపల్లెలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి, ఐపీఎస్‌ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం.వెంకటాద్రి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సైమన్‌ కమిషన్‌ వ్యతిరేక పోరాటంలో బ్రిటిష్‌ తుపాకులకు ఎదురొడ్డి నిలిచిన ఆయన ధైర్యసాహసాలు, నిస్వార్థ ప్రజాసేవ నేటి తరానికి ఆదర్శమని కొనియాడారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
🏠 Home