🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 22 Aug, 2026 | Page: 1

రూ.25 లక్షలతో అండర్‌ డ్రైనేజీ పనులకు శ్రీకారం

పీలేరు, ఆగస్టు 22 (రాజనీతి): పీలేరు పట్టణంలోని బండ్లవంక, ట్రెజరీ వీధి, చేదబాయి వీధుల్లో నెలకొన్న మురుగునీటి సమస్యకు పరిష్కారం లభించనుంది. ఎమ్మెల్యే నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి సహకారంతో రూ.25 లక్షల నిధులతో చేపట్టనున్న అండర్‌ డ్రైనేజీ పనులను మార్కెట్‌ యార్డు చైర్మన్‌ పురం రామమూర్తి శనివారం ప్రారంభించారు. పనులు పూర్తయితే వర్షాకాలంలో రోడ్లపై మురుగునీరు నిలిచిపోవడం, దుర్గంధం సమస్యలు తొలగుతాయని తెలిపారు. పట్టణంలో దశలవారీగా మౌలిక వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఖాదర్ బాషా, మహేష్, విక్రమ్, సురేష్ నాయక్, బాబీ, రాజు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home