🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 18 Aug, 2026 | Page: 1

గంగమ్మ తల్లిని దర్శించుకున్న ట్రాన్స్‌పోర్ట్‌ ప్రముఖులు

రేణిగుంట, ఆగస్టు 18 (రాజనీతి): రేణిగుంట గంగమ్మ జాతర సందర్భంగా శ్రీ కీర్తి ట్రాన్స్‌పోర్ట్‌ అధినేత దేవరాజ్‌నాయుడు, లారీ అసోసియేషన్‌ అధ్యక్షుడు గణపతిరాయల్‌, సాయి గణేష్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అధినేత రెడ్డి ప్రకాష్‌, అరుణ్‌ ప్రసాద్‌, రాజా రాయల్‌, ఎంజీ రాజేష్‌రెడ్డి, జ్యోతి నారాయణ తదితరులు గంగమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. రేణిగుంట ప్రజలను అమ్మవారు చల్లగా చూడాలని, అందరూ సుఖసంతోషాలతో ఉండేలా ఆశీస్సులు ప్రసాదించాలని ప్రార్థించినట్లు తెలిపారు.
🏠 Home