🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 15 Aug, 2026 | Page: 1

ఈత కొడుతూ తిరంగాతో దేశభక్తి చాటిన బీజేపీ నేత

పుంగనూరు,రాజనీతి, ఆగస్టు 15: అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం కొండసముద్రం ప్రాంతంలో రాష్ట్ర బీజేపీ మైనారిటీ మోర్చా నాయకులు పి. అయూబ్ ఖాన్ వినూత్న రీతిలో దేశభక్తిని చాటుకున్నారు.స్థానిక బావిలో ఈత కొడుతూ రెండు చేతుల్లో జాతీయ జెండాలను పట్టుకుని ఆయన త్రివర్ణ పతాకంపై తనకున్న గౌరవాన్ని, దేశంపై ఉన్న అభిమానాన్ని ప్రదర్శించారు. బావి మధ్యలో తిరంగా జెండాలతో ఈదుతున్న అయూబ్ ఖాన్ దృశ్యం స్థానికులను ఆకట్టుకుంది.
జాతీయ జెండాపై గౌరవం, దేశభక్తి ప్రతి ఒక్కరిలో ఉండాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా చాటినట్లు అయూబ్ ఖాన్ తెలిపారు. ఈ వినూత్న ప్రదర్శన స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
🏠 Home