సోమలలో ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ
రాజనీతి |అన్నమయ్య జిల్లా,సోమల| ఆగస్టు 14, 2026
ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవన్నీ పురస్కరించుకొని దేశభక్తిని చాటుతూ బీజేపీ నియోజకవర్గ ఇంచార్జీ గన్నా మదన్మోహన్ బాబు ఆధ్వర్యంలో సోమల మండలంలో శుక్రవారం ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ ఘనంగానిర్వహించారు.ఈ ర్యాలీ సోమల హైస్కూల్ నుంచి ప్రారంభమై బస్ స్టాండ్ మీదుగా ఎంపీడీఓ కార్యాలయం వరకు ఎంపీడీఓ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు గాంధీ సర్కిల్ వద్ద మానవహారం నిర్వహించారు. జాతీయ జెండాలను చేతబూని విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు ర్యాలీలో పాల్గొన్నారు. భారత్ మాతాకీ జై, వందేమాతరం నినాదాలతో సోమల పురవీధులు మార్మోగాయి. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని ఈ సందర్భంగా నిర్వాహకులు పిలుపునిచ్చారు.ర్యాలీలో పాల్గొన్న వారు జాతీయ సమైక్యత, దేశభక్తి, ప్రజల్లో బాధ్యతా భావాన్ని పెంపొందించేందుకు ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సోమల మండల ఎంపీడీవో , ఎం.ఈ.ఓ శివరత్నమ్మ ,జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ అమరేంద్ర , హై.స్కూల్ హెచ్ఎం హేమ సుధాకర్, కూటమి నాయకులు సింగల్ విండో చైర్మన్ శివ శంకర్, టిడిపి సీనియర్ నాయకులు మహేంద్ర బాబు (చిన్నబాబు) సోమల మండల జనసేన అధ్యక్షులు సూరిశెట్టి నాగభూషణం, బిజెపి మండల అధ్యక్షులు హేమగిరి,మాజీ సర్పంచ్ జి.శ్రీరాములు, ఎస్ .సదాశివయ్య, ఎన్.మునివెంకటప్ప తదితరులు పాల్గొన్నారు.