ఫిన్లాండ్ విద్యా అధ్యయన పర్యటనకు పుంగనూరు టీచర్ హేమలత
రాజనీతి | పుంగనూరు | ఆగస్టు 14, 2026:-
పుంగనూరు పట్టణం మునిసిపల్ మోడల్ ప్రైమరీస్కూల్, రామ్ నగర్ ఉపాధ్యాయురాలు , రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సి. హేమలత 15న ఫిన్లాండ్ లో జరిగే శిక్షణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుండి ఉత్తర్వులు అందుకున్నారు. ప్రాథమిక స్థాయిలో అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రం, అభ్యాస నైపుణ్యాలను బలోపేతం చేయడానికి ఆగస్టు 17 నుండి 26వ తేదీ వరకు ఫిన్లాండ్ లోని తుర్కు యూనివర్సిటీ లో జరిగే ఎఫ్ .ఎల్ .ఎన్ శిక్షణా కార్యక్రమంలో హేమలత పాల్గొంటారు. మొత్తం 29 మంది రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు ఈ శిక్షణకు హాజరవు తున్నారు. 2025 సెప్టెంబర్ 5వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సి. హేమలత రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న సంగతి విధితమే. పుంగనూరు మండల ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన హేమలతను మండల విద్యాశాఖ అధికారులు శ్రీ నటరాజ గారు, శ్రీ రెడ్డెన్న శె ట్టి గారు, మండల మరియు పురపాలక సంస్థల ఉపాధ్యాయులు,పలువురు ప్రముఖులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.