🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 14 Aug, 2026 | Page: 1

గండబోయనపల్లి లో ఉచిత ఛాతి ఎక్స్-రే పరీక్షలు టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో ప్రత్యేక వైద్య శిబిరము డిప్యూటీ. హెచ్. ఈ. ఓ. మహమ్మద్ రఫీ

రాజనీతి | వాయల్పాడు | ఆగస్టు 14, 2026:
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న టీబీ ముక్త్ భారత్–2.0 కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు డి. ఎమ్. హెచ్. ఓ. మరియు జిల్లా టి. బి. అధికారి ఆధ్వర్యంలో వాయల్పాడు మండలంలోని గండ బోయన పల్లిలో స్థానిక పి. హెచ్. సి. వైద్యులు డాక్టర్ జులేక బేగం అధ్యక్షతన ఛాతీ ఎక్స్-రే పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరిగిందని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ మరియు టి. బి. పర్యవేక్షకులు నాగిరెడ్డి తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుచు ఈ ప్రత్యేక వైద్య శిబిరాల్లో అనుమానిత టీబీ లక్షణాలు ఉన్నవారికి, అధిక ప్రమాద వర్గాలకు ఉచిత డిజిటల్ ఛాతీ ఎక్స్-రే పరీక్షలు నిర్వహించి, అదే రోజున ఎక్స్-రే రిపోర్టులు అందజేయడం జరుగుతుంది. అవసరమైతే తదుపరి నిర్ధారణ కోసం ఇతర పరీక్షలకు కూడా రిఫర్ చేస్తారు.
టీబీ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి సకాలంలో చికిత్స అందించడం, సమాజంలో టీబీ వ్యాప్తిని అరికట్టడం, టీబీ రహిత భారత్ లక్ష్యాన్ని సాధించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
కాబట్టి రెండు వారాలకు పైగా దగ్గు,రోజూజ్వరం, బరువు తగ్గడం,ఆకలి లేక పోవుట,రాత్రిపూట చెమటలు పట్టడం వంటి టీబీ లక్షణాలు ఉన్నవారు, మరియు షుగర్ వ్యాధి, డయాలసిస్ పేషంట్స్, ధూమ పానం, మద్యపానం సేవించే వాళ్ళు, పోషకాహారం లోపం ఉన్నవాళ్లు, సంబంధిత గ్రామాల్లో నిర్వహించే ఎక్స్-రే శిబిరాలకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై ఈ ఉచిత సేవలను వినియోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ వైద్య శిబిరం లో మొత్తం 148 మందికి ఉచితంగా ఛాతి ఎక్సరే లు తీయడం జరిగింది
ఈ కార్యక్రమంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ, టి. బి. పర్యవేక్షకులు నాగిరెడ్డి, ల్యాబ్ పర్యవేక్షకులు భూపతి, ఎమ్. ఎల్. హెచ్. పి లు మౌనిక, పుష్ప, ఏ. ఎన్. ఎమ్. రాణి, హెల్త్ అసిస్టెంట్ వలి, ఆశాకార్యకర్తలు నీలావతి, రమాదేవి, ప్రజలు పాల్గొన్నారు.
వందనములతో
టి. బి. వ్యాధి లేని సమాజ స్థాపనే మనందరి లక్ష్యం.
టి. బి. అంతం మనందరి పంతం 💯.
🏠 Home