🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 13 Aug, 2026 | Page: 1

పీలేరులో జాతీయ జెండాలతో సైకిల్ ర్యాలీ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో విద్యార్థుల జోష్




హర్ ఘర్ తిరంగా - ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకం

పీలేరులో వందేమాతరం నినాదాలతో ర్యాలీ


పీలేరు: 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా పీలేరులో సైకిల్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు.

గురువారం అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ఆర్డిఓ కార్యాలయం వరకు చేతిలో జాతీయ జెండాలు పట్టుకుని విద్యార్థిని విద్యార్థులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు.

ముఖ్య అతిథులుగా పీలేరు ఆర్డిఓ కె. విజయలక్ష్మి, తహశీల్దార్ శివకుమార్ పాల్గొని ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆర్డిఓ కె. విజయలక్ష్మి మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి. యువత దేశభక్తితో ముందుకు సాగాలి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ద్వారా దేశ ఐక్యతను చాటుదామని పిలుపునిచ్చారు.

తహశీల్దార్ శివకుమార్ మాట్లాడుతూ విద్యార్థులు దేశభక్తిని చాటుతూ సైకిల్ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు యువతలో జాతీయ స్ఫూర్తిని పెంపొందిస్తాయని తెలిపారు.

ర్యాలీ అంతా విద్యార్థులు భారత్ మాతాకీ జై, వందేమాతరం నినాదాలతో హోరెత్తించారు. త్రివర్ణ పతాకాలు రెపరెపలాడుతూ సాగిన ర్యాలీకి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శివశంకర్, ఆర్ఐ మురగయ్య, టిడిపి పీలేరు మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మీకర, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home