🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 13 Aug, 2026 | Page: 1

దళిత నాయకుడిని పరామర్శించిన చింతల రామచంద్రారెడ్డి



ఈరోజు పీలేరు మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెంకటేశ్వరులను ఆరోగ్యరీత్యా బాగులేదని తెలుసుకొని వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లి ఆరోగ్యం గురించి తెలుసుకొని పరామర్శించినాడు ఈ సందర్భంగా చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ

రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దళితులు వెన్ను ఎముకగా నిలిచి పార్టీకి కష్టపడి పని చేస్తూ 2029 లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలని దళితులందరూ ఎదురుచూస్తున్నారని ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి తెలియజేసినారు

కూటమి ప్రభుత్వం వచ్చినప్పటినుండి దళితులపై జరుగుతున్న దాడులు దళిత మహిళలు పై జరుగుతున్న అత్యాచారాలు గురించి తీవ్రంగా మండిపడ్డాడు కూటమి ప్రభుత్వములో బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరగలేదని ఈ సందర్భంగా తెలియజేసినారు ఈ కార్యక్రమంలో

వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి చిన్న ఎల్లప్ప వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వడ్డీ హరి వైసీపీ రాష్ట్ర సహాయక కార్యదర్శి సదాశివ కుమార్ రాష్ట్ర విద్యార్థి విభాగ నాయకుడు చక్రిపీలేరు నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు రాజన్న చిన్న రమణ మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
🏠 Home