🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 12 Aug, 2026 | Page: 1

వెయ్యి మొక్కల నాటే కార్యక్రమానికి పోలీసులు శ్రీకారం

రేణిగుంట, ఆగస్టు 12 (రాజనీతి): పర్యావరణ పరిరక్షణలో భాగంగా రేణిగుంట అర్బన్‌ పోలీసులు వెయ్యి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బుధవారం బాలికల పాఠశాలలో డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ జయచంద్ర, ప్రధానోపాధ్యాయురాలు శ్యామల, ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. భూతాపాన్ని తగ్గించేందుకు పచ్చదనం పెంపొందించాలని డీఎస్పీ సూచించారు. పాఠశాలలో నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతను ఇద్దరు విద్యార్థులకు ఒక్కో మొక్క చొప్పున అప్పగించారు. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులు, ప్రజల్లో అవగాహన కల్పించడమే కార్యక్రమం లక్ష్యమన్నారు.
🏠 Home