లారీ ఢీకొని బైక్ పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు
రేణిగుంట రమణా విలాస్ సర్కిల్‌లో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న స్థానికుడు రాంబాబు తీవ్రంగా గాయపడ్డారు. రమణ విలాస్ సర్కిల్ వద్ద రేణిగుంట వైపు మలుపు తిరుగుతున్న బైక్‌ను అదే దిశగా వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో రాంబాబు ఎడమ కాలుకు తీవ్ర గాయమైంది. సమాచారం అందుకున్న రేణిగుంట అర్బన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని 108 అంబులెన్స్‌లో రాంబాబును తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.