🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 10 Aug, 2026 | Page: 1

హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై ఐఈసీ అవగాహన కార్యక్రమం

రాజనీతి ప్రతినిధి | అన్నమయ్య జిల్లా, రాయచోటి | ఆగస్టు 10, 2026:
అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన కల్పించే ఐఈసీ పోస్టర్లను రాయచోటి RDO శ్రీ శ్రీనివాసులు గారు ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (APSACS) మరియు DISHA ప్రోగ్రామ్ సమన్వయంతో, ప్రజా చైతన్య సేవా సంఘం (PCSS) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అదనపు అధికారి డాక్టర్ ఎల్. రాధిక గారు మార్గదర్శకత్వంలో హెచ్‌ఐవీ నివారణ, హెచ్‌ఐవీ పరీక్షలు, సకాలంలో చికిత్స, చికిత్సా సేవలకు అనుసంధానం మరియు హెచ్‌ఐవీపై ఉన్న అపోహలు, వివక్షను తొలగించడంపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.
2026 ఆగస్టు 12 నుంచి అక్టోబర్ 12 వరకు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి “95:95:99” ఐఈసీ ప్రచార కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య జిల్లాలో వివిధ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో PCSS ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ G. చెన్నారెడ్డి, ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీమతి T. స్వాతి, RDO ఆఫీస్ సిబ్బంది,ICTC కౌన్సిలర్ ఉమాదేవి , LWS సిబ్బంది హరి , అశ్వని,తదితరులు పాల్గొన్నారు.
🏠 Home