🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 10 Aug, 2026 | Page: 1

చైనాను వణికించిన ‘డాల్ఫిన్’ తుపాను 10 లక్షల మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలింపు

రాజనీతి అంతర్జాతీయ ప్రతినిధి | ఆగస్టు 10, 2026

చైనాలో ‘డాల్ఫిన్’ టైఫూన్ తీవ్ర ప్రభావం చూపింది. బలమైన గాలులు, భారీ వర్షాలతో తూర్పు తీర ప్రాంతాలు అతలాకుతలమవుతుండటంతో అధికారులు ముందస్తు రక్షణ చర్యలు చేపట్టారు. తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి 10 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌ తీరాన్ని ఆగస్టు 9న డాల్ఫిన్ తుపాను తాకింది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం సమయంలో తైజౌ నగరంలోని యుహువాన్ ప్రాంతంలో తొలిసారి తీరం దాటిన తుపాను.. కొద్దిసేపటికే వెన్‌జౌ సమీపంలో మరోసారి ల్యాండ్‌ఫాల్ చేసినట్లు వాతావరణ అధికారులు వెల్లడించారు.

తుపాను తీవ్రత దృష్ట్యా చైనా కేంద్ర వాతావరణ సంస్థ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు ప్రమాదకర ప్రాంతాల్లో రాకపోకలను నియంత్రించారు. భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా పలు ప్రాంతాల్లో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడగా, 1,600కు పైగా విమానాలను రద్దు చేసినట్లు సమాచారం.

మరోవైపు తుపాను ప్రభావంతో జెజియాంగ్‌తో పాటు షాంఘై, ఫుజియాన్ తదితర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు అత్యవసర సేవల విభాగాలను అప్రమత్తం చేశారు.

తుపాను ముందుకు కదులుతున్న కొద్దీ దాని తీవ్రత తగ్గుతున్నప్పటికీ, భారీ వర్షాల ముప్పు కొనసాగుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని
🏠 Home