శ్రీలంకలో రామాయణ క్షేత్రాల యాత్ర.. 6 రోజుల ప్యాకేజీ
రాజనీతి ప్రత్యేక ప్రతినిధి | ఆగస్టు 10, 2026
విమానం నుంచి హోటల్ బస వరకు అన్నీ ఒకే ప్యాకేజీలో.. రూ.59,950 నుంచి IRCTC టూర్
రామాయణంతో ముడిపడిన పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకునే భక్తులు, పర్యాటకులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేక అవకాశం కల్పిస్తోంది. శ్రీలంక రామాయణ యాత్ర-2026 పేరుతో 5 రాత్రులు, 6 రోజుల అంతర్జాతీయ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ యాత్రలో రామాయణంతో ముడిపడిన పలు ఆలయాలతో పాటు శ్రీలంకలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంటుంది.
సెప్టెంబర్ 24న బెంగళూరు నుంచి ప్రారంభం
ఈ యాత్ర సెప్టెంబర్ 24, 2026న బెంగళూరు నుంచి ప్రారంభం కానుంది. పరిమితంగా 15 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు IRCTC వివరాలు పేర్కొంటున్నాయి. ముగ్గురు వ్యక్తులు ఒక గదిని పంచుకునే విధానంలో ఒక్కొక్కరికి రూ.59,950 నుంచి ప్యాకేజీ ధర ప్రారంభమవుతోంది. ఇద్దరు వ్యక్తులు షేర్ చేసుకుంటే రూ.60,500, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.81,100గా ధర నిర్ణయించారు.
రామాయణంతో ముడిపడిన ప్రదేశాల సందర్శన
ఆరు రోజుల యాత్రలో కొలంబో, దంబుల్లా, క్యాండీ, నువారా ఎలియా వంటి ప్రాంతాలను కవర్ చేస్తారు. మునేశ్వరం, మునావరం ఆలయాలతో యాత్ర ప్రారంభమై.. దంబుల్లా గుహాలయం, తిరుకోణేశ్వరం, శ్రీ లక్ష్మీ నారాయణ పెరుమాళ్ ఆలయాలను సందర్శించేలా పర్యటనను రూపొందించారు.
క్యాండీలో ప్రసిద్ధ దంతాల ఆలయం సందర్శనతో పాటు సాంస్కృతిక కార్యక్రమాన్ని వీక్షించే అవకాశం ఉంటుంది. నువారా ఎలియాలో శ్రీ భక్త హనుమాన్ దేవాలయం, సీతా అమ్మన్ దేవాలయం, అశోక వాటిక వంటి రామాయణ సంబంధిత ప్రాంతాలను సందర్శిస్తారు.
ప్యాకేజీలో ఏమేం ఉన్నాయి?
ప్యాకేజీలో ఎకానమీ క్లాస్ విమాన ప్రయాణం, 5 రాత్రుల హోటల్ బస, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం, ఏసీ వాహనంలో స్థానిక రవాణా, ప్రవేశ టికెట్లు, టూర్ గైడ్, విదేశీ ప్రయాణ బీమా, జీఎస్టీ, 2 శాతం TCS వంటి సదుపాయాలు ఉన్నాయి.
అయితే విమానంలో భోజనం, వ్యక్తిగత ఖర్చులు, కెమెరా ఫీజులు, బోటింగ్, టిప్స్, లాండ్రీ, మినరల్ వాటర్, షెడ్యూల్‌లో లేని అదనపు ప్రదేశాల సందర్శన వంటి ఖర్చులు ప్యాకేజీలో ఉండవని IRCTC వివరించింది.
పాస్‌పోర్ట్ తప్పనిసరి
ఇది అంతర్జాతీయ పర్యటన కావడంతో ప్రయాణికులు చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ పాస్‌పోర్ట్ వెంట తీసుకెళ్లాలి. భారత్‌కు తిరిగి వచ్చే తేదీ నుంచి కనీసం ఆరు నెలల చెల్లుబాటు ఉండే పాస్‌పోర్ట్ అవసరం. సీట్లు పరిమితంగా ఉన్నందున ముందుగానే బుకింగ్