అమరావతి కప్ 2.0లో మహేష్ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థుల ప్రతిభ
పుంగనూరు, ఆగస్టు 10 (రాజనీతి): అమరావతి కప్ 2.0 జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీల్లో మహేష్ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులు సత్తా చాటి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. చిత్తూరు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ప్రాంగణంలో జరిగిన పోటీల్లో అండర్–17 విభాగంలో పి. మహమ్మద్ రిఫాన్ ఖాన్, ఎం. జ్ఞాన చరిత్, అండర్–21లో వి. రాఘవేంద్ర రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు. విజయవాడలో జరిగే రాష్ట్ర పోటీల్లో చిత్తూరు జిల్లా తరఫున పాల్గొంటారని అధికారులు తెలిపారు. జిల్లా బాక్సింగ్ కోచ్ సురేంద్ర, పీడీ ఇన్‌చార్జ్ భాస్కర్, హెడ్ కోచ్ ఎం.రెడ్డి మహేష్ తదితరులు అభినందించారు.