ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు
మదనపల్లె, ఆగస్టు 9 (రాజనీతి): ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నమయ్య జిల్లా మదనపల్లె జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా, అన్నమయ్య జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి, జిల్లా డీఆర్వో సుబ్రహ్మణ్యం, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాలకుంట శ్రీనివాసులు పాల్గొన్నారు. ఆదివాసీల హక్కులు, సంక్షేమం, విద్య, ఉపాధి, అభివృద్ధిపై ఈ సందర్భంగా చర్చించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన గిరిజనులకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.