🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 09 Aug, 2026 | Page: 1

ఆంబూరు ఎస్టీ కాలనీలో ‘రెండేళ్ల నమ్మకం’

వరదయ్యపాలెం, ఆగస్టు 9 (రాజనీతి): ఆంబూరు ఎస్టీ కాలనీలో పీఏసీఎస్‌ చైర్మన్‌ ఆణిముత్యం నందకిశోర్‌రెడ్డి ఆధ్వర్యంలో ‘రెండేళ్ల నమ్మకం’ కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గిరిజనులకు వివరించారు. అనంతరం సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. కాలనీలోని సమస్యలను నందకిశోర్‌రెడ్డి తన సమస్యలుగా భావించి పరిష్కరిస్తున్నారని గ్రామస్థులు అభినందించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, గిరిజనులు పాల్గొన్నారు.
🏠 Home