🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 08 Aug, 2026 | Page: 1

ప్రధాన కూడళ్లలో పోలీసుల విస్తృత తనిఖీలు

తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా శనివారం సాయంత్రం ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ వినియోగాన్ని పరిశీలించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, మహిళలు, బాలల భద్రత, మాదకద్రవ్యాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై నిఘా కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.
🏠 Home