హరోంహార నామస్మరణతో మార్మోగిన బాలసుబ్రహ్మణ్యస్వామి ఆలయం
పెద్దపంజాణి మండలం కొత్త వీరప్పల్లిలోని శ్రీ బాలసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆడికృత్తిక ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేదపండితుల ఆధ్వర్యంలో హోమాలు, విశేష అభిషేకాలు, పుష్పాలంకరణలు నిర్వహించి స్వామివారి దర్శనం కల్పించారు. కర్ణాటకతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించగా, గ్రామస్తులు, దాతలు, భక్తులు పాల్గొన్నారు.