🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 07 Aug, 2026 | Page: 1

డీఎస్సీపై వైసీపీ ఆరోపణలు హాస్యాస్పదం : ఎంపీపీ హరిప్రసాద్ చౌదరి...

అవకతవకలు జరిగాయని నిరూపిస్తే స్వాగతిస్తామని సవాల్.....

చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్):చిత్తూరు జిల్లా గుడిపాల మండల ఎంపీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీపీ గోళ్ళ హరిప్రసాద్ చౌదరి మాట్లాడారు....డీఎస్సీ నియామకాలపై వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు రిలే నిరాహార దీక్షలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో డీఎస్సీ నిర్వహించకుండా ఇప్పుడు పారదర్శకతపై ప్రశ్నించడం సమంజసం కాదన్నారు.కూటమి ప్రభుత్వం 16,347 మంది నిరుద్యోగులకు ఉపాధ్యాయ నియామకాల ద్వారా అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు.డీఎస్సీ ఎంపికల్లో ఒక్క చిన్న అవకతవక జరిగినా నిరూపించాలని వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు. రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామిక రంగం నిరుద్యోగులు, రైతులు, వెనుకబడిన వర్గాలు, విద్యార్థుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. మంత్రి నారా లోకేష్‌పై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం తగదన్నారు. అవినీతి పాలన కారణంగానే గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీని పరిమిత స్థానాలకు కుదించారని విమర్శించారు.ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని భవిష్యత్తులోనూ తగిన తీర్పు ఇస్తారని అన్నారు. సమావేశంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
🏠 Home