🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 07 Aug, 2026 | Page: 1

అక్రమ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి: ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం

చిత్తూరు జిల్లాలో గుర్తింపు, ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట్ యాదవ్ డీఈఓకు వినతిపత్రం సమర్పించారు. అక్రమంగా అడ్మిషన్లు చేపట్టి అధిక ఫీజులు వసూలు చేస్తున్న సంస్థలపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదుపై విచారణ చేపట్టి నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఈఓ హామీ ఇచ్చారు.
🏠 Home