🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 06 Aug, 2026 | Page: 1

భక్తిశ్రద్ధలతో సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణోత్సవం

చౌడేపల్లిలోని మృత్యుంజయస్వామి దేవస్థానంలో ఆడికృతిక పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామివారికి విశేష అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు నిర్వహించి, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య దివ్య కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. ఉభయదారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా, అనంతరం తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.
🏠 Home