🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 06 Aug, 2026 | Page: 1

వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక టీకాల కార్యక్రమం

కోటపల్లె హైస్కూల్‌లో ప్రత్యేక టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. డిప్తిరియా, కోరింతదగ్గు, ధనుర్వాతం వంటి ప్రాణాంతక అంటువ్యాధుల నివారణకు టీకాలు అత్యంత కీలకమని తలుపుల పీహెచ్‌సీ ప్రధాన వైద్యాధికారులు డా. శ్రీగిరీష, డా. చంద్రశేఖర్ తెలిపారు. ఆగస్టు 3 నుంచి 8 వరకు 5, 10, 16 ఏళ్ల విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో డీపీటీ, డీటీ టీకాలు వేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
🏠 Home