🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 05 Aug, 2026 | Page: 1

రాజముద్ర పాస్‌బుక్కులతో రైతులకు భరోసా: ఎమ్మెల్యే నల్లారి

కలికిరి, ఆగస్టు 5 (రాజనీతి): కలికిరి మండలం కె.రెడ్డివారిపల్లిలో 1,256 మంది రైతులకు రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్‌బుక్కులను పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసి రీ సర్వే ద్వారా రైతులకు స్పష్టమైన భూ వివరాలతో పాస్‌బుక్కులు అందిస్తోందన్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, భూ సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో, తహసీల్దార్, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
🏠 Home