🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 05 Aug, 2026 | Page: 1

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి.. మరో మహిళ పరిస్థితి విషమం

పుంగనూరు, ఆగస్టు 5 (రాజనీతి): అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం శాంతినగర్ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లక్ష్మి అనే మహిళ మృతి చెందగా, మీనా అనే మరో మహిళ తీవ్రంగా గాయపడింది. ద్విచక్ర వాహనంపై కుమారుడితో కలిసి వెళ్తున్న లక్ష్మి, రోడ్డు దాటుతున్న మీనాను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మీనాను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
🏠 Home