🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 05 Aug, 2026 | Page: 1

వైభవంగా పాలేటి గంగమ్మ అమ్మవారి ఊరేగింపు

సోమల, ఆగస్టు 5 (రాజనీతి): సోమలలో పాలేటి గంగమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి. బుధవారం అమ్మవారు పుట్టినిల్లుగా భావించే పాయల వంశస్థుల ఇంటికి వెళ్లి సంప్రదాయం ప్రకారం చీరసారె స్వీకరించారు. అనంతరం ప్రత్యేక అలంకరణతో పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లగా భక్తులు హారతులు ఇచ్చి మొక్కులు చెల్లించారు. డప్పు, మంగళవాయిద్యాల నడుమ జరిగిన ఊరేగింపులో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని గ్రామ సుఖశాంతుల కోసం ప్రార్థించారు.
🏠 Home