🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 05 Aug, 2026 | Page: 1

ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రేపటి పర్యటన

పుంగనూరు, ఆగస్టు 5 (రాజనీతి): పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం రెండు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు పుంగనూరులో డీఎస్సీ అభ్యర్థులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు తెలుపుతారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు సదుం శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో జరిగే ఆడి కృత్తిక మహోత్సవాల్లో పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయం వెల్లడించింది.
🏠 Home