🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 05 Aug, 2026 | Page: 1

కాయకల్ప తనిఖీలతో కలికిరి సీహెచ్‌సీ పరిశీలన

కలికిరి, ఆగస్టు 5 (రాజనీతి): కాయకల్ప పథకంలో భాగంగా కడప జిల్లా క్వాలిటీ కంట్రోల్ అధికారి డాక్టర్ సరళా దేవి కలికిరి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రి విభాగాలు, రికార్డులు పరిశీలించి రాష్ట్ర స్థాయి అసెస్‌మెంట్‌కు సిద్ధంగా ఉండాలని వైద్యాధికారి డాక్టర్ వై. పవన్ కుమార్‌కు సూచించారు. ఓపీ, ఐపీ, లేబర్ రూమ్, ఆపరేషన్ థియేటర్‌లో ప్రమాణాలు పాటించాలని, పరిశుభ్రత, వైద్య సేవల నాణ్యతను కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యులు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.
🏠 Home