బిడ్డకు తల్లిపాలే నీరు, తల్లిపాలే ఆహరం. డిప్యూటీ హెచ్. ఈ. ఓ. మహమ్మద్ రఫీ
వాయల్పాడు ఆగష్టు 5 /8/26
నవజాత శిశువుకు తల్లిపాలే నీరు -తల్లిపాలే ఆహరం అని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ అన్నారు. బుధవారం వైద్య ఆరోగ్య శాఖ,
ఐసీడీఎస్ శాఖల ఆధ్వర్యంలో ' ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు' చింతపర్తి గ్రామము అంగన్వాడీ కేంద్రాల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది . ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ఆవశ్యకత, ప్రాముఖ్యతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను స్థానిక వైద్యులు డాక్టర్ జులేఖ బేగం ఆధ్వర్యంలో డిప్యూటీ హెచ్. ఈ. ఓ మహమ్మద్ రఫీ మరియు అంగన్వాడీ పర్యవేక్షకులు భానులక్ష్మి నిర్వహించారు.
ఈ సందర్బంగా డిప్యూటీ హెచ్. ఈ. ఓ. మాట్లాడుతూ.. బిడ్డ పుట్టిన గంట లోపు తల్లీబిడ్డలకు స్పర్శను కల్పిస్తూ తప్పనిసరిగా ముర్రుపాలు పట్టించాలని సూచించారు. ముర్రుపాలు శిశువు పాలిట అమృతంతో సమానమని, అవి బిడ్డకు తొలి టీకాగా పనిచేసి జీవితాంతం రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయని, తల్లిపాలు కల్తీ లేనివి, ఖర్చు లేనివి, సురక్షితమైనవని వివరించారు.
పుట్టినప్పటి నుంచి కనీసం ఆరు నెలల పాటు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అప్పుడే పిల్లలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఎదుగుతారని స్పష్టం చేశారు. బిడ్డకు అవసరమైన అన్ని పోషకాలు, విటమిన్లు తల్లిపాలలోనే పుష్కలంగా ఉంటాయి. బయటి పాలు, డబ్బా పాలు వాడటం వల్ల పిల్లలు తరచూ అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందన్నారు బిడ్డకు పాలివ్వడం ద్వారా తల్లులు కూడా రొమ్ము, గర్భసయా క్యాన్సర్లు,స్తులకాయం లాంటి సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారని అవగాహన కల్పించారు. ముర్రుపాలు పారబోయకూడదని, అపోహలు విడనాడి ప్రతి తల్లీ తప్పనిసరిగా బిడ్డకు పాలివ్వడాన్ని ఒక బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.తల్లికి గర్భషయం యదా స్థానానికి వచ్చుటకు వీలగును. రక్తశ్రావం ఆగి పోవును.
ఆరోగ్యవంతమైన నవసమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని తల్లులను కోరారు.అనంతరం టేక్ హోమ్ రేషన్ 24మంది తల్లులకు పంపిణీ చేయడం జరిగింది. తల్లులచే ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.ఈ కార్యక్రమంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ, సి. హెచ్. ఓ. అరుణ, అంగన్వాడీ పర్యవేక్షకులు భానులక్ష్మి,స్థానిక అంగన్వాడీ కార్యకర్తలు పార్వతి, అనంతలక్ష్మి, సునీత, రెడ్డి ప్రసన్న, ఆశాకార్యకర్తలు శ్రీదేవి, రమణమ్మ, అనురాధ ఆయాలు, మరియు పెద్ద సంఖ్యలో గర్భిణులు, బాలింతలు, గ్రామ మహిళలు పాల్గొన్నారు.