🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 04 Aug, 2026 | Page: 1

ప్రతి గడపకు ప్రభుత్వ సంక్షేమం.. 12వ డివిజన్‌లో గోపీనాథ్ విస్తృత ప్రచారం...

చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్):చిత్తూరు నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడమే లక్ష్యంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సూచనల మేరకు 12వ డివిజన్ ఇన్‌చార్జ్ గోపీనాథ్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో ఇంటింటి ప్రచారం కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజా సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి చేరేలా అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతుల అభివృద్ధి, విద్య, వైద్యం, తాగునీరు, రహదారులు, పారిశుధ్యం వంటి రంగాలకు ప్రాధాన్యం ఇస్తోందని ప్రచారంలో వివరిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తూ ప్రభుత్వ పనితీరుకు మరింత బలం చేకూరుస్తున్నారని పేర్కొంటున్నారు.చిత్తూరు అభివృద్ధే ధ్యేయంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యాలు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని ప్రచారంలో వివరించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ప్రజలకు చేరవేయడంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. 12వ
డివిజన్ ఇన్‌చార్జ్ గోపీనాథ్ ప్రజలతో నిత్యం మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను వివరించడం ద్వారా ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించే ప్రయత్నం జరుగుతోందన్నారు.రాబోయే ఎన్నికల్లో అభివృద్ధి, పారదర్శక పాలనకు ప్రజలు మద్దతు ఇవ్వాలని, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు సహకరించాలని నాయకులు కోరారు. చిత్తూరు సమగ్ర అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రతి అర్హ కుటుంబానికి చేరేలా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.ప్రజాసేవలో చురుకుగా పనిచేస్తున్న గోపీనాథ్‌కు భవిష్యత్తులో మరింత బాధ్యతలు లభించాలని కార్యకర్తలు, అభిమానులు ఆకాంక్ష వ్యక్తం చేశారు.
🏠 Home